MLC Kavitha | హైదరాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం చూపించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించకుండా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. విగ్రహం మొదటి అంతస్తులోకి వెళ్లి నివాళులర్పిస్తామని నాయకులు చెప్పినా పోలీసులు అనుమతించలేదు. మొదటి అంతస్తులోకి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డు తగిలారు. దీంతో ఎమ్మెల్సీ కవిత సహా నాయకులంతా గ్రౌండ్ ఫ్లోర్ లో బైఠాయించి జై భీమ్ నినాదాలు చేశారు. అనంతరం మొదటి అంతస్తులోకి వెళ్లి నివాళుర్పించేందుకు పోలీసులు అనుమతించారు. దీంతో అంబేద్కర్ విగ్రహానికి బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ యాదవ్ మండల్, ఇతర నాయకులతో కలిసి ఆమె నివాళులర్పించారు.
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మహనీయులను అగౌరవ పరచడం ఏమాత్రం మంచిది కాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ మీద అక్కసుతోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించలేదని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.. అందుకే అంబేద్కర్ విగ్రహం వద్దకు రాలేదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదన్న విషయం ముఖ్యమంత్రి గమనంలోకి తీసుకొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించాలని డిమాండ్ చేశారు.
BREAKING
125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులు
మొదటి అంతస్తులోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వని పోలీసులు
జై భీమ్ నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించిన బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు
పోలీసులతో స్వల్ప… pic.twitter.com/iudgDzavpA
— Sarita Avula (@SaritaAvula) April 14, 2025
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సమన్యాయం చేయాలని కేసీఆర్ ప్రభుత్వంలో అడుగులు వేశామన్నారు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా నగరం నడిబొడ్డున కేసీఆర్ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయించిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ విగ్రహం వద్ద జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించలేదని, ముఖ్యమంత్రి, మంత్రులు అంబేద్కర్ విగ్రహానికి దండ వేయకుండా ఆయనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మహనీయుడు విగ్రహం వద్ద లైట్లు కూడా వేయకుండా చీకట్లో మగ్గేలా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరును ప్రజాస్వామికవాదులంతా తప్పుబట్టిన తర్వాత ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా కేబినెట్ మంత్రులంతా వచ్చి దండవేయడాన్ని హర్షిస్తున్నామని అన్నారు.