KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణకు బయల్దేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు కొద్దిసేపటి క్రితం ఆయన బయల్దేరి వెళ్లారు. కేటీఆర్ వెంట హరీశ్‌రావు జూబ్లీహిల్స్ పీఎస్‌కు వెళ్లారు.
అయితే కేటీఆర్ వెంట వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారు బయటకు వెళ్లకుండా ఉండేందుకు గేట్లను మూసివేశారు. పోలీసుల చర్యపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా చొరబడుతున్నారని మండిపడ్డారు.
తెలంగాణ భవన్ గేట్లు మూసివేస్తున్న పోలీసులు
రాజకీయ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా చొరబడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఆగ్రహం pic.twitter.com/vMfdmNzfNG
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2026
తెలంగాణ భవన్ నుండి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరిన కేటీఆర్
కేటీఆర్ వెంట పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన హరీష్ రావు
కేటీఆర్ వెంట వెళ్తున్న కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు https://t.co/VQtv5PVMS0 pic.twitter.com/JCh5LCkNbl
— Telugu Scribe (@TeluguScribe) January 23, 2026