RS Praveen Kumar | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధిత కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పట్నం నరేందర్ రెడ్డిని శంకర్పల్లి వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
పీఎస్ వద్ద బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. భార్యను చంపేసిండు.. పిల్లలను చంపేసిండు.. మైనర్ బాలికను, వాళ్ల నాయినమ్మను చంపేసిండు.. అట్లా ఆరుగురిని చంపేసిండని అన్నారు. ఈ నిందితుడిపై మే 16న మైనర్ బాలిక పిర్యాదు చేసింది. వీడు నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నడు.. ఇప్పటికే వీడికి పెళ్లైంది. నేను ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థిని. నా ప్రాణానికి ప్రమాదముందని చెప్పి.. ఈ అమ్మాయి, వాళ్ల మామ, అమ్మ మే 16న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఆ రోజు పోలీసులు సెక్షన్ 78, సెక్షన్ 351, సెక్షన్ 11 పోక్సోయాక్ట్ నమోదు చేసిర్రు. ఈ మూడు కూడా బెయిల్ వచ్చే కేసులు. స్టేషన్లో అట్ల పోయి ఇట్ల బయటకు వచ్చే కేసులు వాడిమీద పెట్లారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
మాజీ పోలీసాఫీసర్‌గా నాకు సిగ్గనిపిస్తున్నది..
ఇది మొదటి తప్పయితే.. ఇంకా ఘోరమైన విషయం లక్షమంది పోలీసులు తలదించుకునే విషయం. ఒక మాజీ పోలీసాఫీసర్‌గా నాకు సిగ్గనిపిస్తున్నది. ఒక్క రోజు కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. 55 రోజులైంది. ఒక్క రోజు కూడా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కౌన్సెలింగ్ ఇవ్వడమో.. బాధితురాలి బాధ అర్థం చేసుకోవడమో చేయలేదు.. బాధితురాలు మైనర్ బాలిక అయినప్పుడు ఒక మహిళా డీసీపీనో మహిళా ఇన్స్పెక్టరో, మహిళా ఏసీపీనో ఎవరో ఒకరు ఆమెతో మాట్లాడి ఆమె స్టేట్మెంట్ను మళ్లీ రికార్డు చేసి.. ఆమెను మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అప్పుడు సెక్షన్లను మార్చే అవకాశం ఉండే కదా.. ? అని ప్రశ్నించారు. సెక్షన్ మారిస్తే వాడు జైలుకు పోయేటోడు కదా.. వాడు జైలుకు పోకుండా చూసిర్రు.
మే 8వ తేదీని బండి సాయి భగీరథ్‌ను జైలుకు పోకుండా చూసిండు రేవంత్ రెడ్డి.. ఇక్కడ కూడా మే 16న వాడు జైలుకు పోకుండా చూసిర్రు. అంటే పోక్సో నిందితులంటే నీకంత ప్రేమ ఏంటి రేవంత్ రెడ్డి అని అన్నారు. వాడు 55 రోజులు జైలుకు పోకుండా కోర్టుకు పోయి వానంతట వాడే రాజులాగా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్‌కు ఎంటరైతే మీరు నేరస్థుల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నరా..? ప్రజల నుంచి నేరస్థులకు రక్షణ కల్పిస్తున్నరా..? రేవంత్ రెడ్డి చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
నిందితుడు ఆరుగురుని చంపిన తర్వాత కూడా పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు. పోలీసులు సరైన సమయంలో స్పందించి, నిందితున్ని అరెస్ట్ చేసి జైలుకు పంపితే ఇంతటి దారుణం జరిగేది కాదన్నారు. బాధిత కుటుంబం ప్రాణ భయం ఉందని చెప్పిన తర్వాత కూడా పోలీసులు పట్టించుకోలేదన్నారు.
పోక్సో నిందితులపై రేవంత్ రెడ్డికి ఎందుకింత ప్రేమ?
రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం పోక్సో కేసులకు అడ్డాగా మారింది
బండి భగీరథ్‌ను 9 రోజులు అరెస్ట్ చేయలేదు.. ఆరుగురిని దారుణంగా హత్య చేసిన రాజ్ కుమార్‌ను 55 రోజులు అరెస్ట్ చేయలేదు
ఫ్యూచర్ సిటీలో అమ్మాయిలకు రక్షణ లేదు
ఫ్యూచర్ సిటీ… https://t.co/G2AB3iRssK pic.twitter.com/XIFF889xjD
— Telugu Scribe (@TeluguScribe) July 11, 2026
Riddhi Chauhan: 300 మంది అమెరికా నేవీ క్యాడెట్స్‌కు లీడర్‌గా భారతీయ విద్యార్థిని