Hyderabad | ఎల్బీనగర్, మార్చి 11 : సరూర్‌నగర్ పీఎస్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు కథనం ప్రకారం.. ఈ నెల 10వ తేదీనాడు వీవీ నగర్‌లోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సరూర్‌నగర్ సీఐ సైదిరెడ్డి, ఎస్ఐ మారయ్య పోలీసులతో కలిసి పేకాట శిబిరం వద్దకు చేరుకున్నారు. అక్కడ పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 35,360 నగదు, 208 పేక ముక్కలు, 12 మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం వారిని సరూర్‌నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అందర్నీ రిమాండ్‌కు తరలిస్తామన్నారు. పేకాట చట్ట విరుద్ధమని, ఎవరైనా ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ సైదిరెడ్డి హెచ్చరించారు.