జియాగూడ, మార్చి 24: ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.18,000 జీతం ఇవ్వాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టారు. సోమవారం చలో హైదరాబాద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆశ వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా సోమవారం కోఠిలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద పెద్దఎత్తున చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు.
ధర్నాలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులకు ఆశ వర్కర్లకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే ఆందోళన చేపట్టిన ఆశవర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం జీతం రూ.18వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మేం కూడా ఆడపిల్లలమే కదా సార్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించి పని భారాన్ని తగ్గించాలంని ఆశ వర్కర్లు తెలిపారు.