BRS Party | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో పనిచేసేందుకు ఇతర పార్టీల నేతలు నూతన ఉత్సాహంతో ముందుకొస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ముందుకెళ్తున్నాయి. తాజాగా హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యువ నాయకుడు పిల్లుట్ల రఘు బీఆర్ఎస్లో చేరారు.
పిల్లుట్ల రఘుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు పిల్లుట్ల రఘు హుజూర్నగర్ నుంచి తన అనుచరులతో కలిసి డప్పు చప్పుళ్ల మధ్య తెలంగాణ భవన్కు చేరుకున్నారు.
కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు తెలంగాణ భవన్కు చేరుకున్న హుజూర్నగర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ యువ నాయకుడు పిల్లుట్ల రఘు pic.twitter.com/iesIG3502r
— Telugu Scribe (@TeluguScribe) April 26, 2026
హుజూర్నగర్ నియోజకవర్గానికి చెందిన పిల్లుట్ల రఘుకు కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/1yXebLc2X1
— BRS Party (@BRSparty) April 26, 2026