బండ్లగూడ, ఏప్రిల్ 8 : బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. చిన్నపాటి గాలి దుమారానికే కరెంటు పోతున్నది. దీంతో ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారు. కరెంటు కోసం అధికారులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో వీచిన కొద్దిపాటి గాలి దుమారానికి బండ్లగూడలోని పలు ప్రాంతాలలో వైర్లు తెగిపోవడంతో ప్రజలు రాత్రంతా జాగారం చేస్తూ రోడ్లపైకి వచ్చారు. ఈ విషయం అధికారులకు తెలిపేదుకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించకపోవడంతో ప్రజల ఆగ్రహం వ్యక్తం చేశారు. కిస్మత్పూర్లో ఓ బిల్డర్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టడంతో గాలికి విద్యుత్ లైన్ నిర్మాణానికి తగలడంతో కరెంటు పోయిందని స్థానికులు తెలిపారు.