 
                                                            జూబ్లీహిల్స్, అక్టోబర్30ః తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల సంక్షేమ, భద్రత కోసం విశేషంగా కృషిచేసి పదేండ్లు అన్ని వర్గాలకు సుపరిపాలన అందించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చెప్పారు.

గురువారం ఇందిరానగర్‌లో తెలంగాణ ఫుడ్స్ మాజీ ఛైర్మెన్ రాజీవ్ సాగర్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద పటేల్, బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, సీనియర్ నాయకుడు గోసుల శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి జూబ్లీహిల్స్ క్రిష్టియన్ ప్రముఖులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాగంటి గోపినాథ్ తమకు అన్ని వేళలా అండగా ఉన్నారని.. కష్టకాలంలో క్రైస్తవ సమాజమంతా వారి కుటుంబానికి అండగా ఉంటుందని క్రిష్టియన్ ప్రముఖులు తెలిపారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత గోపినాథ్ ఘన విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

ఈ సమావేశంలో క్రిష్టియన్ ప్రముఖులు విద్యాసాగర్ రావు, జోసెఫ్ నాగేశ్వర్, విజయ్‌కుమార్, రాకేష్, విలియం, ప్రశాంత్, లియో లూయిస్, సల్మాన్ రాజ్, ఉదయ్ బాబు మోహన్, మోజెస్ తదితరులు పాల్గొన్నారు.
 
                            