Jagadish Reddy | తెలంగాణ ప్రజలే మీకు బువ్వ పెట్టిర్రు. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని సాదారు. మీ పెరుగుదలలో, మీ ఎదుగుదలలో ప్రతీ ఇంచు తెలంగాణ ప్రజల దయాదాక్షిణ్యమని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ కామెంట్స్ నేపథ్యంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మీ గురించిఎవరు మాట్లాడితే వాళ్ల గురించి మాట్లాడు.. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్‌తో ప్రజలను మోసం చేస్తున్నరని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్ కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఆడుతున్న డ్రామా తప్ప మాకు ఇందులో ఇంకోటి కనిపిస్తలేవన్నారు.
ప్రభుత్వం ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అది ప్రభుత్వ చేతకానితనం. ఆఫ్ట్రాల్ పవన్ కల్యాణ్‌కు అనుమతి ఇస్తే శాంతి భద్రతల సమస్య వస్తదా..? తెలంగాణ నుంచి ఆంధ్రాకు ఆంధ్రా నుంచి తెలంగాణకు పోయేందుకు ఎవరూ ఎవరినీ ఆపలేరు. కానీ ఎవరు ఆపినోడు కూడా లేరు.. కానీ కావాలని చెప్పిఇవాళ రాష్ట్రంలో ఉన్న రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఆస్పత్రుల సమస్యలు అన్నింటిని పక్కదారి పట్టించేందుకు ఆడుతున్న డ్రామా తప్ప ఇంకోటి లేదన్నారు.
ఇక్కడి ప్రజా సమస్యలు డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకమే ఇదని జగదీష్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నాడు.. అడ్డుకున్నారు అంటున్నారు కానీ ఎవరు అడ్డుకున్నారో చెప్పడంలేదు. అనుమతి ఎవరు ఇవ్వలేదో వారి గురించి మాట్లాడకుండా మిగతా వాళ్ల గురించి ఎందుకు మాట్లాడడం? ఇది ప్రజల సమస్యలకు సంబంధించిన అంశం కాదు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగదీష్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు
ఇక్కడి ప్రజా సమస్యలు డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకమే ఇది
పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నాడు
అడ్డుకున్నారు అంటున్నారు కానీ ఎవరు అడ్డుకున్నారో చెప్పడంలేదు
తెలంగాణ ప్రజల దయతో ఇంత ఎత్తుకి… https://t.co/VwIUvM4u7I pic.twitter.com/KCQXI3zn1a
— Telugu Scribe (@TeluguScribe) June 2, 2026
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్‌గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు