సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ దృష్ట్యా ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఇబ్బందులు తలెత్తకుండా రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శుక్రవారం ట్రావెల్ అడ్వైసరీ విడుదల చేసింది.
విమాన సేవలు వినియోగించుకునే డొమెస్టిక్ ప్రయాణికులు 2 గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని సూచించింది. విదేశీ ప్రయాణికులు 3 గంటల ముందే చేరుకోవాలని కోరింది. డీజీ యాత్ర సేవలు ఉపయోగించుకోవాలని పేర్కొంది. ఇబ్బందులు లేని ప్రయాణం కోసం తమ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.