కాచిగూడ,ఫిబ్రవరి 9 : కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌దారులకు రూ.9 వేల రూపాయలు పెంచాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.కృష్టమూర్తి అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెన్షనర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 9,10,11 మూడు రోజుల దేశ వ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం బర్కత్‌పుర ఈపిఎఫ్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
ఈ సందర్బంగా కృష్టమూర్తి, అధ్యక్షుడు నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. అర్హత కలిగిన పెన్షనర్లందరికి హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని వారు కోరారు. అనంతరం పెన్షనర్స్, రిటైర్డ్ అసోసియేషన్ ప్రతినిధులు బర్కత్‌పుర ఇపిఎఫ్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనార్ధన్‌రెడ్డి, బ్రహ్మచారి, నాగేశ్వరరావు, నరహరి, సోమయ్య,తదితరులు పాల్గొన్నారు.