హైదరాబాద్ : అతివేగం ఓ నిండు ప్రాణాన్ని(Road accident) బలితీసుకుంది. బాధిత కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి(Person died )చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఎస్ఆర్ నగర్(SR Nagar)లో శుక్రవారం చోట చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.