మూసాపేట, మార్చి 20: హైదరాబాద్లోని మూసాపేట వై జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) యువకుడు మృతి చెందారు. గురువారం ఉదయం బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని మూసాపేట వై జంక్షన్ మలుపు వద్ద కూకట్పల్లి నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయాలవడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మూసాపేట నుంచి బాలానగర్ వైపు బైక్పై వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉన్నదని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.