హైదరాబాద్: హైదరాబాద్లో ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటుచేసుకున్నాయి. పాతబస్తి (Old City)లోని కిషన్ బాగ్ ఎక్స్ రోడ్ సమీపంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం సెల్లార్లో మంటలు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. భవనంపై అంతస్తులోనూ దట్టంగా పొగ అలుముకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్న వారిని సురక్షితంగాగా బయటకు తీసుకువచ్చారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
జీడిమెట్లలో..
జీడిమెట్ల (Jeedimetla) లోని దాసరి సంజీవయ్య కాలనీలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో తీవ్రంగా గాయపడిన జలగం సాయి సత్య శ్రీనివాస్ (32) అక్కడిక్కడే మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రికి చెందిన ఆయన పటాన్చెరు రుద్రారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, కేసు నమోదుచేశారు. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చనిపోయాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.