Minister Konda Surekha | తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
నాంపల్లి స్పెషల్ కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. కొండా సురేఖను అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కేటీఆర్ కోరారు.
e-cigarette: పార్లమెంట్లో ఈ-సిగరేట్ తాగిన టీఎంసీ ఎంపీ.. బీజేపీ ఆరోపణలు
Fire Accident | మంచిర్యాలలో ఇంటిపై అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
Panchayat Polling | ముగిసిన తొలి విడుత పోలింగ్.. కొద్దిసేపట్లో మొదలుకానున్న కౌంటింగ్