అట్టహాసంగా బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్
రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖ లు చేశారు. తొలుత నామినేషన్ పత్రాలకు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలతో ర్యాలీలు నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
- మంత్రి గంగుల, విప్ గువ్వల ఇతర ఎమ్మెల్యేల పత్రాల దాఖలు
నమస్తే తెలంగాణ, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం నామినేషన్లు దాఖ లు చేశారు. తొలుత నామినేషన్ పత్రాలకు దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలతో ర్యాలీలు నిర్వహించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ దాఖలు చేశారు. చొప్పదండిలో ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ హాజరయ్యారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్నపునేని నరేందర్.. శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్‌తో కలిసి వచ్చి నామినేషన్ వేశారు.
నర్సంపేట స్థానానికి పెద్ది సుదర్శన్‌రెడ్డి 2 సెట్ల నామినేషన్లు సమర్పించారు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్..గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. డోర్నకల్ నియోజకవర్గం నుంచి డీఎస్ రెడ్యానాయక్.. మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, రాష్ట్ర ప్రధా న కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి, రామసహాయం రంగారెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేటలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తిలో ఎమ్మె ల్యే జైపాల్‌యాదవ్, నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారుల కు అందజేశారు. మర్రి జనార్దన్‌రెడ్డి మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో క లిసి వెళ్లి నామినేషన్ వేశారు.
సంగారె డ్డి జిల్లా నారాయణఖేడ్ స్థానానికి సి ట్టింగ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి 2 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అందోల్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ నామినేషన్ దాఖ లు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తొలుత పార్టీ కార్యాలయంలో తన తండ్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఆశీర్వాదం తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ నామినేషన్ దాఖలు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

