సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ) : స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎన్‌ఈసీతో(NEC company) కలిసి పనిచేస్తామని టీ హబ్(T-Hub) సీఈఓ ఎం.ఎస్.రావు తెలిపారు. ఎన్ఈసీ నెట్వర్స్ అండ్ సిస్టం ఇంటిగ్రేషన్ కార్పొరేషన్ సీనియర్ మేనేజర్ టెట్సూ ఓకుడ(Tetsuo Okuda) టీ హబ్‌ను సందర్శించి స్టార్టప్ కార్యకలాపాలపై చర్చించారని తెలిపారు.
టెక్నాలజీ స్టార్టప్ ఇంక్యుబేటర్‌గా ఉన్న టీ హబ్ సరికొత్త టెక్నాలజీలను స్టార్టప్‌లకు ఉపయోగపడేలా ఆయా పరిశ్రమలకు చెందిన నిపుణులతో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తోందని, అదేవిధంగా జపాన్‌కు చెందిన కంపెనీ టీహబ్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉందన్నారు. ఎన్ఈసీ అనుబంధ సంస్థగా ఉన్న ఎన్ఈఎస్ఐసీ సంస్థ టెలికమ్యూనికేషన్స్, ఐసీటీ, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్‌ను అందించడంతో ఎంతో అనుభవం ఉందని, అలాంటి సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా స్టార్టప్‌లకు ఎంతో మద్దతు లభిస్తుందన్నారు.