Numaish | హైదరాబాద్ : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ నిర్వహణకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జనవరి 1 నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు నుమాయిష్ కొనసాగనుంది. నుమాయిష్‌లో స్టాళ్ల నిర్వహణకు 2,500 దరఖాస్తులు రాగా, ఇందులో 2,200 ఫైనల్ చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి బీ సురేందర్ రెడ్డి తెలిపారు. రెగ్యులర్‌గా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇక గతేడాది కంటే ఈ సారి ఎంట్రీ టికెట్ ధరలు పెంచాలని నిర్ణయించినట్లు చెప్పారు. గతంలో రూ. 40 ఉండగా, దాన్ని రూ. 50కి పెంచుతున్నట్లు తెలిపారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా వచ్చిన ఫండ్‌ను పిల్లల ఎడ్యుకేషన్‌కు ఖర్చు చేస్తామన్నారు.
ఇక నుమాయిష్‌లో హ్యాండ్లూమ్స్, రెడీమెడ్ గార్మెంట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంటి ఫర్నీచర్, బొమ్మలతో పాటు ఇతర వస్తువులను విక్రయిస్తారని తెలిపారు. ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రతి రోజు రాత్రి 10.30 గంటలకు నుమాయిష్ స్టాల్స్ తెరిచి ఉంటాయన్నారు. శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Traffic Restrictions | రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు
KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం : కేటీఆర్
Rasamai Balakishan | రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై రసమయి బాలకిషన్ పాట.. వీడియో