Traffic Restrictions | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఎయిర్ షో నిర్వహించనున్నారు. ఈ ఎయిర్‌షో 30 నిమిషాల పాటు నిర్వహించనున్నారు. ఎయిర్ షోలో భాగంగా వాయుసేన విమానాలు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్యాంక్‌బండ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
KTR | లగచర్లలో భూసేకరణ రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తాం : కేటీఆర్
KCR | 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. కేసీఆర్‌కు ఆహ్వానం
Rasamai Balakishan | రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై రసమయి బాలకిషన్ పాట.. వీడియో