సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఓలా, ఉబర్ రద్దు చేయడంతో పాటు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లాలో ఆటో బంద్ నిర్వహించారు. అందులో భాగంగా ఆటో ర్యాలీ తీసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు.
ఈ బంద్కు నగర ఆటో డ్రైవర్లు, యూనియన్ నాయకులు తరలివెళ్లి తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వేముల మారయ్య మాట్లాడుతూ.. జిల్లాల వారీగా ఆటో బంద్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా తొలుత నల్గొండ జిల్లా బంద్ నిర్వహించినట్లు వివరించారు.