MLA Sudheer Reddy | మూసీ నది ప్రక్షాళన మొదట ప్రారంభమైందే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో.. మా కేసీఆర్ నాయకత్వంలోనని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఈ విషయమై సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంలో ఆ పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలంతా తీవ్రమైన భయాందోళనల మధ్య బతుకుతున్నరన్నారు.
ముఖ్యమంత్రి పోకడ చూస్తే మూసీ నది ప్రక్షాళన చేస్తా అంటున్నరు.. చేయనీయండి.. మేం కూడా స్వాగతిస్తున్నాం.. మేం మూసీ నది ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. కానీ చాలా సందర్బాల్లో సీఎం మేం మూసీ నది ప్రక్షాళన చేయబోతుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది.. చేయనిస్తలేదు.. ఇదేనా వాళ్ల పని అని అంటున్నారు. మూసీ నది ప్రక్షాళన ప్రారంభమైందే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో.. మా కేసీఆర్ నాయకత్వంలో అని గుర్తు చేస్తున్నామన్నారు సుధీర్ రెడ్డి.
ప్రక్షాళనలో మూడు స్థాయిలుంటాయి. మొదటిది మూసీలోకి ప్రవహిస్తున్న హైదరాబాద్‌లోని సీవేజ్ వాటర్నంతా కూడా వివిధ రకాలుగా వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో ఎస్టీపీలు పెట్టి శుద్ధిచేసి స్వచ్చమైన నీటిని మూసీలో వదిలే ప్రక్రియ అని సుధీర్ రెడ్డి చెప్పారు. ఆ మొదటి ప్రక్రియ రూ.3600 కోట్ల రూపాయలతో ఆరోజు సీఎం కేసీఆర్ ప్రారంభించి 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత అది 31 ఎస్టీపీలు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఇక్కడి వరకు 11వేల స్ట్రక్చర్లు బఫర్ జోన్లో గుర్తించాం. కానీ ఎక్కడ కూడా ఒక్క స్ట్రక్చర్ కూలగొట్టేందుకు మేం ముందుకు రాలేదు. ఎందుకంటే నేను, కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి ముగ్గురం కలిసి కేసీఆర్ దగ్గరకు పోయి.. సార్ ఇన్ని స్టక్చర్స్ వస్తున్నయ్ మరి ఏం చేద్దామంటే.. ఇన్ని ఇండ్లు కూలగొట్టి మనం మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదు. ఇల్లు కూలగొట్టకుండా ఏవిధంగా చేయగలుగుతమో ఇంకో ఫార్ములాతో నా దగ్గరకు రండి నా ముందుకు అప్పుడు దాన్ని టేకప్ చేద్దామని చెప్పారు.
నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వమే మారిపోయింది…
ఇల్లు కూలగొట్టకుండా ఏవిధంగా చేయాలో మేం రెండు ఫార్ములాలు తయారు చేసే వరకే ఎలక్షన్ నొటిఫికేషన్ వచ్చింది.. ఆ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వమే మారిపోయింది. ఈ ప్రభుత్వం కక్షగట్టినట్టు ఇవాళ పేద ప్రజల మీద పడి వాళ్ల ఇళ్లకు రెడ్ మార్కులు పెట్టి నిద్రాహారాలు లేకుండా చేసింది అంటూ మండిపడ్డారు. ఇయ్యాళ మనుషులు నిద్రపోతలేరు, అన్నం తింటలేరు.. మా మూసీలో పేరుకుపోయిన ఒండ్రుమట్టి 50-60 ఏండ్ల నుంచి ఇండస్ట్రియల్ ఉత్పత్తులు, కాలుష్య కారకాలంతా పేరుకపోయినయ్. వాటినంతా తీసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిబంధనల ప్రకారం పక్కకు వేసేసి రెండు పక్కల రోడ్డు అభివృద్ధి చేసి నీరునిరంతరం ప్రవహించేలా చేయాలన్నది.. మేం రూ.6 కోట్లు ఖర్చు పెట్టామన్నారు.
మూడోది కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వరం నదీ జలాలను మూసీ నదికి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌కి తీసుకొచ్చి దాదాపు 15 చెక్‌డ్యాంలు కట్టి.. నిరంతం ఆ చెక్‌డ్యాంలలో నీళ్లు నిల్వ ఉండే విధంగా తద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాల మట్టాలు తగ్గిపోకుండా తగు చర్యలు తీసుకున్నామన్నారు. అదే విధంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను డీ కంజేషన్ చేద్దామన్న ఉద్దేశంతో ఇరువైపులా నార్త్, వెస్ట్ కారిడార్‌ను తయారు చేసి నాగోల్ నుంచి గండిపేట్ వరకు రోడ్ లింక్‌ను కూడా ప్లాన్ చేసినం. మధ్యలో 15 బ్రిడ్జిలు ప్లాన్ చేశాం. ఈ 15 కూడా మంజూరు చేసినం. అందుకు రూ.500 కోట్లు కూడా కేటాయించినం. మొదటి బ్రిడ్జి పీర్జాదిగూడ నుంచి నాగోల్ పతుల్లాగూడ వరకు కూడా శంకుస్థాపన చేశాం. పనులు కొనసాగుతున్నాయి. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినంక మేం చేసిన పనులకన్నింటికి చివరి ప్రాధాన్యత ఇచ్చి అసలు పూర్తి కావొద్దన్న ఉద్దేశంతో దాన్ని నత్తనడకన నడిపిస్తున్నరన్నారు.
మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉండే ప్రజలు తీవ్ర భయాందోళనలతో బతుకుతున్నారు.
మూసీ ప్రక్షాళన చేయబోతుంటే బీఆర్ఎస్ అడ్డుపడుతుందని అంటున్నారు, మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు.
అసలు మూసీ ప్రక్షాళన ప్రారంభమైందే కేసీఆర్ గారి నాయకత్వంలో.
మొదట మూసీ నది… pic.twitter.com/gqTsDlPX0Q
— BRS Party (@BRSparty) March 18, 2026
Assembly Elections | అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్
Mallikarjun Kharge: మమ్ముల్ని ప్రేమించారు.. మోదీని పెళ్లి చేసుకున్నారు: మల్లిఖార్జున్ ఖర్గే
TS Assembly | యూరియా యాప్ పేరుతో ప్రభుత్వం రైతులను వేధిస్తోంది : మాజీ మంత్రి వేముల