కారు గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి
మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
- కళ్లముందుండే కారు కావాలా? ఢిల్లీలో ఉండే బీజేపీ కావాలా?.. రాజగోపాల్‌రెడ్డికి ఓటేస్తే అతడికి లాభం
- కూసుకుంట్లను గెలిపిస్తే నియోజకవర్గానికి మేలు: మంత్రి హరీశ్‌రావు
మర్రిగూడ, అక్టోబర్ 19: మునుగోడు ప్రజలకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనంతరం పత్తా లేకుండా పోయిండని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గ్రామాల్లో కనిపించని రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. బుధవారం ఉదయం ఆయన రాజుపేటతండా నిర్వహించిన గ్రామసభలో గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి టిఫిన్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బీజేపీని గెలిపిస్తే 3వేల పింఛన్ ఇస్తామని ఆ పార్టీ నాయకులు అంటున్నారని, అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పిన్నతల్లికి బంగారు గాజులు చేయించినట్లుగా బీజేపీ నేతల మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కారు గురుకు ఓటు వేసి భారీ మెజార్టీ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలన్నారు.
పానం ఉన్నంత వరకు కారు గుర్తుకే నా ఓటు..మనసులోని మాట చెప్పిన ముసలవ్వ
వ్యవసాయ యూనివర్సిటీ, అక్టోబర్ 19 : “బతికున్నాన్నాళ్లూ నా ఓటు కారు గుర్తుకే వేస్తా నాయనా.. కేసీఆర్ సార్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ ఇస్తున్నడు. నాకు ఓటు వచ్చినప్పటి నుంచి గతంలో ఎవ్వరూ నన్ను పట్టించుకోలే. కేసీఆర్ సారే నా పెద్ద కొడుకు. ఇన్నాళ్లు విలువగా బతుకుతున్నానంటే నాకు పెన్షన్ ఇస్తున్నందుకే నా పిల్లలు నన్ను ఆదరిస్తున్నారంటూ..తన ఇంటికి ఎన్నికల ప్రచారానికి వచ్చిన వారితో ఓ వృద్ధురాలు తన మనుసులోని మాట చెప్పింది. ఈ సంఘటన మునుగోడు నియోజక వర్గంలోని చండూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాములవ్వ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ఓటును అభ్యర్థించగా దీంతో రాములవ్వ మనసువిప్పి మాట్లాడి టీఆర్ఎస్పై తన అభిమానాన్ని చాటింది. ప్రచార కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, సులేమాన్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నయీముద్దీన్ , యాసిన్ సరికొండ వెంకటేశ్, ఎండీ ముఖ్రమ్ఖాన్ ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
Medicover Hospital | మెడికవర్.. రేవంత్ బినామీ దవాఖాన : కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

