హైదరాబాద్ : హైదరాబాద్ నగర వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూసీ నదికి వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో మూసారాంబాగ్ బ్రిడ్జి మునిగిపోయింది. బ్రిడ్జి పై నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను వేరే మార్గాల్లో మళ్లించారు. ముసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక చాదర్‌ఘాట్ బ్రిడ్జి నుంచి నల్లగొండ ఎక్స్ రోడ్డు వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అవసరమైతేనే బయటకు రావాలని నగర వాసులకు పోలీసులు సూచిస్తున్నారు.
మెహిదీపట్నం, గోషామహల్, మంగళ్‌హాట్, ఆసిఫ్‌నగర్, జియాగూడ, పురానాపూల్, బహదూర్ పురా, ఫలక్‌నూమా, చాంద్రాయణగుట్ట, అఫ్జల్‌గంజ్, లక్డీకాపూల్, నాంపల్లి, పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, సికింద్రాబాద్, కూకట్పల్లి, బాలానగర్, బోయిన్పల్లి, శేరిలింగంపల్లి, చిలకలగూడ, తిరుమలగిరి, మారేడుపల్లి, ప్యాట్నీ సెంటర్, బేగంపేట్, సోమాజిగూడ, రాంనగర్, తార్నాక, ఓయూ, అంబర్‌పేట, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, మలక్‌పేటతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది.