సిటీబ్యూరో, జూన్ 9 (నమస్తే తెలంగాణ): దిగువ స్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో ఎండలు మండిపోతున్నాయి.
మరోవైపు ఉత్తర ఛత్తీస్గడ్ నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం గరిష్ఠం 39.7, కనిష్ఠం 27.0 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 32 శాతంగా నమోదైనట్లు వెల్లడించారు.