హామీల అమల్లో ప్రభుత్వం విఫలం.. 10న ‘చలో హైదరాబాద్’
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిషరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా ఒక ప్రధాన హామీని కూడా నెరవేర్చలేదని స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గుండవరం దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిషరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని, మూడేండ్లు కావస్తున్నా ఒక ప్రధాన హామీని కూడా నెరవేర్చలేదని స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గుండవరం దేవీప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు పదేపదే విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఆందోళనకు దిగాల్సి వస్తున్నదని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 10 ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మూడేండ్లపాటు సహకరించినా సమస్యలు పరిషరించకుండా, ఇప్పుడు మరో రెండేండ్ల సమయం కావాలని కోరడం ఉద్యోగులపట్ల ప్రభుత్వ అమానుష వైఖరిని స్పష్టంచేస్తున్నదని రేవంత్ సరార్పై మండిపడ్డారు.
నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వేతన సవరణ చేయకుండా మరో రెండేండ్లు పీఆర్సీ అడుగొద్దని అనడం ప్రజాస్వామిక హకులను కాలరాయడమేనని అన్నారు. ఐదేండ్లకు అమలు చేయాల్సిన పీఆర్సీని ఆల స్యం చేసి పదేండ్లకు మార్చే కుట్రలో భాగంగానే సీఎం ప్రకటనలు ఉన్నాయనే అనుమానం ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నదని తెలిపారు. గతంలో చంద్రబాబునాయుడు సరార్ పదేండ్లకు ఒకసారి పీఆర్సీ ప్రతిపాదించినప్పుడు ఉద్యోగులు తిప్పికొట్టిన చరిత్రను గుర్తుచేశారు. తక్షణమే పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల విడుదల, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) పునరుద్ధరణ, పెన్షన్ బకాయిల చెల్లింపుతోపాటు మ్యానిఫెస్టో హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

