నర్సు హత్యాచారంపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
ఇటీవల హైదరాబాద్ శివారు తుకుగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సు హత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం.. సమగ్రంగా మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు.
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తేతెలంగాణ): ఇటీవల హైదరాబాద్ శివారు తుకుగూడలోని ఓ ప్రైవేట్ దవాఖానలో నర్సు హత్యాచార ఘటనలో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం.. సమగ్రంగా మెజిస్టీరియల్ విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్న నేపథ్యంలో దర్యాప్తును అత్యం త పకడ్బందీగా పూర్తిచేయాలని ఆదేశించారు.
దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను వీలైనంత వేగంగా పూర్తిచేసి సమగ్ర చార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

