Rain Alert | సిటీబ్యూరో, ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాగల రెండురోజుల్లో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతంగా మారింది. గచ్చిబౌలి, షేక్‌పేట, బోడుప్పల్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 29.4, కనిష్ఠం 22.6 డిగ్రీలు, గాలిలో తేమ 71శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.