సిటీబ్యూరో, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు నగరంలోని బేగంపేటలో 3.25 సెం.మీలు, బహుదూర్పురాలోని సులేమాన్‌నగర్‌లో 3.0సెం.మీలు, ఆసిఫ్‌నగర్‌లో 2.45 సెం.మీలు, టోలీచౌకిలో 2.18 సెం.మీలు, షేక్‌పేట, శ్రీనగర్‌కాలనీ, బోయిన్పల్లి, హయత్‌నగర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో సెంటిమీటర్‌కు పైగా వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఉపరితల ద్రోణి కారణంగా రాగల మరో రెండు రోజులు నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల భారి వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు.