దుండిగల్, సెప్టెంబర్7: దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు క్రీడాప్రావీణ్యం కలిగిన విద్యార్థులను సైతం వెన్నుతట్టి ప్రోత్సహిస్తోంది. ఇందుకు నిదర్శనంగా కళాశాల యాజమాన్యం 2017-18 విద్యాసంవత్సరం నుంచి 2025-26 విద్యాసంవత్సరం ప్రైవేశాలు పూర్తయ్యేనాటిని 170 మంది విద్యార్థులకు క్రీడాకోటా కింద ఉచిత ప్రవేశాలను కల్పించింది. తద్వార విద్యతో పాటు క్రీడలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలోనే పేరెన్నిక గల కళాశాలగా పేరు సంపాదించుకుంది. ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో క్రీడాకోటాను ఏర్పాటు చేసి ప్రతిభ కల్గిన క్రీడాకారులకు ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచితంగా సీట్లు కేటాయిస్తూ సరికొత్త రికార్డు సృష్టిస్తోంది ఎంఎల్ఆర్ ఐటీ కళాశాల. దీంతోక్రీడల్లో రాణిస్తూనే విద్యార్థులు బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ వంటి ఉన్నత చదువులు పూర్తిచేస్తున్నారు.
దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్‌లో ప్రపంచస్థాయి క్రీడా ప్రాంగణాలు అందుబాటులో ఉన్నాయి. ఇండోర్ స్టేడియం, ఫుట్‌బాల్ మైదానం, ప్రత్యేకమైన వాలీబాల్ కోర్టులు, అథ్లెట్ల కోసం 400మీటర్ల రన్నింగ్ ట్రాక్‌తో పాటు క్రమం తప్పకుండాప్రాక్టీస్ చేసుకునేలా క్రికెట్ గ్రౌండ్ ఇలా ఎన్నింటినినో విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడం కోసం 10మంది సుశిక్షితులైన ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్‌లను నియమించి ఔత్సాహిక విద్యార్థులకు తర్ఫీదునిస్తూ నాణ్యమైన క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు.
2017-18విద్యాసంవత్సరంలో 32 సీట్లు, 2018-19లో 41 సీట్లు, 2019-20లో 31 సీట్లు, 2021-22లో 14 సీట్లు, 2022-23లో 11 సీట్లు, 2023-24లో 16 సీట్లు, 2024-25లో 13 సీట్లు, 2025-26 విద్యా సంవత్సరంలోప్రతిభకల్గిన 12 మంది విద్యార్థులకు ఇక్కడ స్పోర్ట్స్ కోటా కింద ఉచితంగా ప్రవేశాలు కల్పించారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలనే సదుద్దేశ్యంతోనే కళాశాలలో స్పోర్ట్స్ కోటాను ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉచితంగా ప్రవేశాలు కల్పిస్తున్నాం.మా తండ్రి మర్రిలక్ష్మన్రెడ్డి స్వతహాగా క్రీడాకారుడు (వెటరన్ అథ్లెట్) కావడంతో ఆయనను రోల్‌మోడల్‌గా తీసుకుని కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ స్థాయి, అత్యున్నత ప్రమాణాలతో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే మా కళాశాలకు చెందిన కొంతమంది విద్యార్థులు అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లల్లో పాల్గొని సత్తాచాటారు. 2017-18 విద్యాసంవత్సరం నుండి 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశాల నాటికి 170మంది క్రీడా నేపధ్యం కల్గిన విద్యార్థులకు ఉచితంగా ప్రవేశాలు కల్పించాం. భవిశ్యత్‌లో మరింతమంది ప్రతిభావంతులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తాం.
– మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే, ఎంఎల్ఆర్ఐటీ వ్యవస్థాపక కార్యదర్శి