వెంగళరావునగర్,అక్టోబర్17: మా ఓట్లన్నీ మీకే..గెలుపు మీదేనంటూ ముస్లింలు అభయమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ అలీనగర్‌లో శుక్రవారం ప్రచారంలో భాగంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ముస్లింలను ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటెయ్యాలని మాగంటి సునీతను గెలిపించాలని కోరారు. ఉర్దూలో ప్రచురించిన కరపత్రాలను అందజేశారు.తామంతా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తామని ముస్లింలు వారికి మాటిచ్చారు.ఈ కార్యక్రమంలోమీర్పేట హౌసింగ్ బోర్డు డివిజన్ కార్పొరేటర్ ప్రభుదాస్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, బైరీనవీన్ గౌడ్,ఇంద్రయ్య, కుమార స్వామి, రహీం,దినేష్,పిల్లి సాయిరమామ్, వీరేందర్, శ్రీనగర్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు అప్పుఖాన్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్,అక్టోబర్17:బీఆర్ఎస్తోనే నగర అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సోమాజీగూడ డివిజన్లోని 279, 282 బూత్‌లలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ..పదేండ్లలో హైదరాబాద్ నగరం ఎంతగా అభివృద్ధి చెందిందో గుర్తించిన ప్రజలు గత ఎన్నికల్లో బీఆర్ఎస్కే పట్టం కట్టారని గుర్తు చేశారు. బూత్‌స్థాయి నాయకులు నాగమణి, ఉమారాణి, అవినాష్, మారుతి, ఇన్చార్జ్జిలు పీఎన్ గౌడ్, మహిపాల్, సాయి, ప్రవీణ్, జ్ఙానేశ్వర్, గౌస్, ప్రశాంత్, మహేష్, కిషోర్, షాద్‌నగర్ బీఆర్ఎస్ నాయకులు రామకృష్ణ, మహదేవ్పూర్ రవీందర్‌రెడ్డి, చెరుకుపల్లి సర్పంచ్ ప్రేమ్ కుమార్, నరసప్పగూడ ఉప సర్పంచ్ శేఖర్, యువ నాయకులు దినేష్, సుధీర్, మధు, సురేందర్, పెరుమల్రెడ్డి, ప్రవీణ్, క్రిష్ణ, శివ కుమార్ పాల్గొన్నారు.