 
                                                            జూబ్లీహిల్స్,అక్టోబర్30 : జూబ్లీహిల్స్ విజయంతో బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌రెడ్డి, తాండూర్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం సోమాజీగూడ డివిజన్ అబీబ్బాగ్, సంజయ్‌గాంధీనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రగతినగర్‌లోని సాయిరాం మనోహర్ అపార్ట్మెంట్లో డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ మహేష్ యాదవ్, నాయకులు ప్రదీప్ చౌదరి, అప్పుఖాన్, పోలింగ్ స్టేషన్ల ఇన్చార్జులు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
 
                            