బంజారాహిల్స్,అక్టోబర్ 16: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని ఎమ్మెల్సీ, రహ్మత్‌నగర్ డివిజన్ ఎన్నికల ఇన్చార్జి తక్కెళపల్లి రవీందర్రావు తెలిపారు. డివిజన్ పరిధిలో ప్రచార వ్యూహాలు, ప్రచారం సాగుతున్న తీరు, ప్రజల్లో కనిపిస్తున్న స్పందన తదితర అంశాలపై గురువారం ఆయన మాట్లాడారు. రహ్మత్‌నగర్ డివిజన్లో 75 పోలింగ్ బూత్‌లలో సుమారు 72వేలమంది ఓటర్లు ఉన్నారు. ఈ బూత్‌లను 11 క్లస్టర్లుగా విభజించుకుని ఇన్చార్జిలను నియమించుకున్నామని రవీందర్రావు తెలిపారు.
గులాబీ జెండా చూడగానే ఓటర్లలో ఉత్సాహం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం కోసం రహ్మత్‌నగర్ డివిజన్లో బస్తీలకు వెళ్లినప్పుడు మంచి స్పందన లభిస్తోందని రవీందర్రావు తెలిపారు. గులాబీ జెండా చూడగానే జై కేసీఆర్ అంటూ ఓటర్లే నినాదాలు చేస్తున్నారన్నారు. ముఖ్యంగా వృద్ధ్దులు, మహిళలు బయటకు వచ్చి తామంతా గత మూడు ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసామని చెప్పడంతో పాటు కాంగ్రెస్ ఇచ్చిన తప్పుడు హామీలను గురించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడత ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ బాకీ కార్డులు పంచినప్పుడు కాంగ్రెస్ గుర్తు చూస్తేనే కోపంతో ఊగిపోయిన వారు కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోపేదలు అత్యధికంగా నివాసం ఉండే డివిజన్‌గా రహ్మత్‌నగర్‌కు పేరుంది. ఉప ఎన్నికలో మాగంటి సునీతమ్మను గెలిపించుకుంటామని చెబుతున్నారు. మాగంటి గోపీనాథ్ చొరవతో రిజర్వాయర్ నిర్మాణం, ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్, కమలానగర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, దళిత్ స్టడీ సెంటర్, కార్మికనగర్ రోడ్డు విస్తరణ వంటిఎన్నో పనులు పూర్తయ్యాయని రవీందర్రావు తెలిపారు.