MLA Vemula Prashanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 07 : బీఆర్ఎస్ నేత హరీష్ రావుతోపాటు ఇతర నాయకులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని.. రేవంత్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. పరిగి పర్యటనకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావును మార్గమధ్యంలో అప్ప జంక్షన్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇండస్ట్రియల్ పార్క్ పేరిట భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న హరీశ్ రావుతోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి తదితరులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. హరీశ్ రావును వికారాబాద్ జిల్లా పరిగికి చేరకుండా పోలీసులు అడ్డుకోవడం మాత్రమే కాకుండా, అరెస్ట్ చేయడం అత్యంత ఆక్షేపణీయమన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ రైతులకు అండగా నిలవడానికి వెళ్తున్న నాయకులను నిర్బంధించడం ప్రభుత్వం తీరును బహిర్గతం చేస్తోందని విమర్శించారు.
అరెస్ట్ చేసిన నేతలను శంషాబాద్ మీదుగా షాద్నగర్ వైపు బలవంతంగా తరలించడం, వారు ఎక్కడికి తీసుకెళ్తున్నారో వెల్లడించకపోవడం ప్రజల్లో అనుమానాలను పెంచుతోందని అన్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరును బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించగా, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష స్వరాన్ని అణచివేయడం అసహ్యకరమని పేర్కొన్న వేముల ప్రశాంత్ రెడ్డి, వెంటనే ఈ ఘటనపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, అరెస్ట్ చేసిన నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మీరెన్ని అరెస్టులు, కుట్రలు, కుతంత్రాలు చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ దాహన్ని, కబ్జాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటామని హెచ్చరించారు.
Reservoirs | తెలంగాణలో తీవ్ర నీటి సంక్షోభం.. డెడ్ స్టోరేజ్ దిశగా తెలంగాణ జలాశయాలు
Anant Ambani | ఆధ్యాత్మిక సేవలో అంబానీ వారసుడు.. గురువాయూర్, రాజరాజేశ్వరం ఆలయాలకు రూ.18 కోట్ల సాయం!
New Shayampet | కాలుష్య కోరల్లో చెరవులు..పట్టించుకోని అధికారులు