బన్సీలాల్‌పేట్: కొండపోచమ్మ సాగర్‌లో ఈత కోసం వెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఘటనలో మరణించిన బన్సీలాల్‌పేట్ డివిజన్లోని చాచానెహ్రూనగర్‌కు చెందిన కిషన్, సుమలత దంపతుల కుమారుడు దినేశ్వర్ మృతదేహానికి ఆదివారం ఆయన నివాళులర్పించారు. ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా విలపించిన దినేశ్వర్ కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు.
తన ప్రగాఢ సానుభూతిని తెలిపి తన వంతుగా ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ ఎంతో భవిష్యత్ ఉన్న యువకుల జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడం బాధాకరమన్నారు. అంతా నిరుపేద కుటుంబాలకు చెంచిన వారేనని, ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు.