హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) సెక్రటరీ దేవరాజ్‌ను మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )సన్మానించారు. త్వరలో జరగనున్న ఐసీసీ(ICC) క్రికెట్ టోర్నమెంట్‌కు భారత జట్టుకు మేనేజర్‌గా నియమితులైన సందర్భంగా దేవరాజ్ శుక్రవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేవరాజ్‌ను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Beerla Ilaiah | ప్రభుత్వ విప్ ఐలయ్యకు నిరసన సెగ.. అర్హులైన వారి పేర్లను ఇప్పుడే ప్రకటించాలని సవాల్
Grama sabhalu | కన్నీళ్లు, వేడుకోళ్లు, ఆగ్రహ జ్వాలలు.. చివరి రోజు రణరంగంగా మారిన గ్రామ సభలు
KTR | అమ్మాయిలకు సాధికారత ఇవ్వండి.. ప్రపంచాన్ని మార్చండి : కేటీఆర్