బన్సీలాల్‌పేట్, జనవరి 3 : నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు ఆధ్వర్యంలో శుక్రవారం నాయ(MLA Talasani)కులు, కార్యకర్తలు మారేడ్‌పల్లిలోని కార్యాలయంలో అయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఎలాంటి ప్రజా సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కొత్త సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
Cold Wave | తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత.. ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
KTR | రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలి..? రేవంత్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్