హైదరాబాద్ : కొండ పోచమ్మ ఘటనపై మాజీ మంత్రి,ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి 5 గురు విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో బన్సీలాల్ పేటలోని సీసీ నగర్‌కు చెందిన దినేష్ పార్ధీవ దేహానికి తలసాని నివాళులు(Tribute) అర్పించారు. తల్లిదండ్రులను పరామర్శించారు. ఎంతో భవిష్యత్ ఉన్న చిన్నారులు అర్ధాంతరంగా మృతి చెందడం తనను కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించి ఆదుకోవాలన్నారు. ఆయన వెంట బాధిత కుటుంబ సభ్యులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Bhuvanagiri | భువనగిరిలో బీఆర్ఎస్ మహా ధర్నాకు పోలీసుల అనుమతి నిరాకరణ.. భారీగా మోహరించిన పోలీసులు
Leopard | ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చిరుత సంచారం
Rythu Bharosa | సాగుయోగ్యమైన భూములకే రైతు భరోసా.. 26 నుంచి నిధులు పంపిణీ