హైదరాబాద్ : పారిశుధ్య నిర్వహణలో పారిశుధ్య కార్మికుల(Sanitation workers) సేవలు వెలకట్టలేనివని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) ప్రశంసించారు. గాంధీ జయంతి సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ లోని MG రోడ్డు లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా పారిశుధ్య కార్మికులు నిత్యం శ్రమించి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నారు. వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పారిశుధ్య పనులు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. వారి సంక్షేమానికి పాటుపడేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Also Read..