ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం ఏది?
జల్పల్లి సర్కిల్ పరిధిలోని ప్రీమియం గార్డెన్లో తహసీల్దార్ ఇందిరా దేవి అధ్యక్షతన ఎమ్మెల్యే సబితారెడ్డి చేతులమీదుగా గువారం 360 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు.
- ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
- హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్
- కేసీఆర్ కిట్టును బందు పెట్టారు
- చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా రెడ్డి ఫైర్
బడంగ్పేట్, ఏప్రిల్16: జల్పల్లి సర్కిల్ పరిధిలోని ప్రీమియం గార్డెన్లో తహసీల్దార్ ఇందిరా దేవి అధ్యక్షతన ఎమ్మెల్యే సబితారెడ్డి చేతులమీదుగా గువారం 360 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ఎన్నిక పారదర్శకంగా జరగడం లేదన్నారు. అర్హులను కాదని కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇళ్లు ఇస్తామంటే ఊరుకునేది లేదన్నారు.
వేసవి కాలంలో వాదే ముస్తాఫా కాలనీలో మంచి నీళ్లు రావడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఎస్ఎన్డీపీ నాలాలను క్లీన్ చేయించాలన్నారు. కళ్యాల లక్ష్మి , షాదీముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రజలకు ఆశపెట్టి ఇప్పటివరకు ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకట్రామ్, ఆర్ఐ జమీల్, ప్రశాంతి, నాయకులు సూరెడ్డి కృష్ణారెడ్డి, సాలే బామ్, ఆవుల జానార్ధన్, అబ్దుల్ తదితరులు ఉన్నారు.
రేవంత్ రెడ్డి కొత్తగా ఇచ్చిందేమీ లేదు
గతంలో కేసీఆర్ ఇచ్చిన చెక్కులను ఇప్పుడు ఇస్తున్నారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. గతంలో కేసీఆర్ కిట్టు ఇచ్చేవారు.. కానీ ఇప్పుడు ఇవ్వడం లేదు. న్యూట్రీషన్ ఇవ్వడం లేదు. అన్నీ దొంగ మాటలు చెప్తున్నారు. కనీసం మంచినీళ్లు కూడా సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ హయాంలోనే అన్నివర్గాల వారు సుభిక్షంగా ఉండేవారు.
– నసీమా బేగం, లబ్ధిదారురాలు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

