నిధి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. వరాహ్ ఫిల్మ్స్ పతాకంపై సునీత్ పడోల్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ‘మైథాలజికల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నిధి అగర్వాల్ పాత్ర మునుపెన్నడూ చూడని విధంగా కొత్త పంథాలో ఉంటుంది.
మహిళా ప్రధాన ఇతివృత్తంతో అందరిని ఆకట్టుకుంటుంది’ అని దర్శకుడు అన్నారు. ఈ సినిమా తాలూకు టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.