కందుకూరు, జులై 29 : దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) తెలిపారు. ఎమ్మార్పీఎస్ టీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు కంద పెద్ద నర్సింహ సోమవారం ఆమెను కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దళితులకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. దళిత బంధు పథకాన్ని(Dalitha bandhu) ప్రవేశపెట్టి రూ, 10లక్షలను ఆర్థిక సాయం చేసినట్లు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం (Congress) దళితుల పట్ల చిన్నచూపు చూస్తుందని పేర్కొన్నారు. దళితులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటూ ప్రభుత్వంపై సమస్యల పరిష్కారానికి పొరాటం చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జిల్లెల్ల కృష్ణారెడ్డి, ఊటు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.