మల్కాజిగిరి, జనవరి 2: శామీర్‌పేట వరకు మెట్రో రైల్(Metro rail) కలను సాకారం చేస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం బోయిన్‌పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మెట్రో రైల్ సాధన సమితి నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Rajasekhar Reddy) మాట్లాడుతూ.. ప్యారడైజ్ నుంచి మేడ్చల్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్‌పేట వైపు మెట్రో రైల్‌ను విస్తరించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నాటి సీఎం కేసీఆర్ ప్రజలకు మెరుగైన రవాణ సౌకర్యం కల్పించాలని మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం ప్రణాళికలు రూపొందించారని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం మెట్రో రైల్ ఆమోదం తెలపడంతో పాటు ప్రథమ ప్రాధాన్యత క్రమంలో మొదలు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మెట్రో రైల్ సాధన సమితి నాయకులు సంపత్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, అనిల్, గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Vinod Kumar | తెలంగాణ హైకోర్టులో జడ్జిల నియామకానికి చర్యలు చేపట్టాలి : వినోద్ కుమార్
Siricilla | అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని విద్యార్థిపై దాడి.. మనస్తాపంతో ఆత్మహత్య
Deepthi Jeevanji | ఓరుగల్లు ముద్దుబిడ్డ జీవాంజి దీప్తికి అర్జున అవార్డు