హైదరాబాద్ : సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గత పదేండ్ల కాలంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగిస్తామని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్(Padmarao Goud) అన్నారు. సీతాఫల్మండి డివిజన్ పరిధిలో మంగళవారం ఆయన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీతాఫలమండి పరిధిలో కొత్తగా రూ.10 కోట్ల ఖర్చుతో నాలా విస్తరణ పనులకు ఆమోదం లభించిందని తెలిపారు.
మహమూద్గుడ వద్ద సివరేజ్ సమస్యలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు జరపాలని పద్మారావు గౌడ్ ఆదేశించారు. ఈ సందర్భంగా మహమూద్గూడలో రూ.8 లక్షల ఖర్చుతో సివరేజ్ లైన్ ఏర్పాటు పనులను, ఇందిరానగర్ కాలనీలో రూ.18 లక్షల ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ హేమతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విద్యా సాగర్, నవ్య, స్వర్ణ లత, కౌశిక్, నాయకులు కరాటే రాజు, బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త రాజ సుందర్, తదితరులు పాల్గొన్నారు.