ఎమ్మెల్యే పద్మారావుగౌడ్
సికింద్రాబాద్, నవంబర్ 27 : తెలంగాణ భవన్ లో ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమానికి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో బైక్‌లతో భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ వెల్లడించారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నేతల అత్యవసర సమావేశం బుధవారం సీతాఫల్‌మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన పద్మారావు గౌడ్ మాట్లాడారు.