చిక్కడపల్లి,ఫిబ్రవరి6: అశోక్‌నగర్ మీదుగా వెళ్లే 40 నంబర్ ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధికారులను ఆదేశించారు. 40 నంబర్ బస్సును దారి మళ్లించడంతో అశోక్‌నగర్, చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొటున్న విషయాన్ని ఎమ్మెల్యే ముఠాగోపాల్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏసీపీ మురళీ కృష్ణ, ముషీరాబాద్ బస్‌డిపో మేనేజర్ కిషన్‌రావు, హిమాయత్‌నగర్ ఇన్స్పెక్టర్ వెంకన్న తదితర అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు సర్వీస్ లేక పోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యను ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ గాంధీనగర్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్‌కుమార్, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం (బీఆర్ఎస్కేవీ),ఆర్టీసీ అధికారుకలు బీఎస్‌రావు, ఎస్ఎస్.చారి తదితరులు పాల్గొన్నారు.
నిరు పేదలకు బియ్యం పంపిణీ…
కవాడిగూడ, ఫిబ్రవరి 6: పేదలను ఆదుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్‌పూర్ డివిజన్ పద్మశాలీ కాలనీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బాబురావు ఆధ్వర్యంలో 20 మంది నిరు పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవరుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముఠా జయసింహ, వై. శ్రీనివాస్ రావు, గంగాధర్, దశరథ్, శ్రీనివాస్ రెడ్డి, ముప్పిడి నర్సింగరావు, నర్సింగ్ రావు, మల్లం రమేశ్ పాల్గొన్నారు