చిక్కడపల్లి, డిసెంబర్11 : తెలంగాణను సాధించి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిన సీఎం కేసీఆర్ దేశాభివృద్ధి కోసం జాతీయ పార్టీని ఏర్పాటు చేయడం పట్ల ప్రజలందరూ స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తోనే దేశ అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఎవరెంత హేళన చేసినా స్థిర సంకల్పంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని, రాష్ర్టాన్ని ఎనిమిదేండ్లలోనే అద్భుత పురోగతితో దేశానికే మార్గనిర్దేశం చేసే స్థాయికి తెచ్చారని అన్నారు. తెలంగాణ మార్పును చూసి నట్లే దేశంలో పరివర్తను చూడబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జైయసింహ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, మాజీ కార్పొరేటర్లు ముఠా పద్మ, మాచర్ల పద్మ, నాయకులు ముఠా నరేశ్, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, గుండు జగదీశ్ బాబు, ముచ్చకుర్తి ప్రబాకర్, గడ్డమీది శ్రీనివాస్, రవిశంకర్ గుప్తా, పి.సత్యనారాయణ, పాశం రవి, ముఠా శివసింహ, పీస్.శ్రీనివాస్, ఎంబి. కృష్ణ, బి. కిరణ్‌కుమా ర్, భాస్కర్ రెడ్డి, సి. హన్మంతు, శ్రీకాంత్, ఎం. సురేశ్, వెంకటేశ్, జహంగీర్, దేవయ్య, తుడుం లక్ష్మి, ఎం. పద్మ, వనజ, సుధా తదితరులు పాల్గొన్నారు.
క్రైస్తవుల అభివృద్ధికి ప్రభ్తుత్వం పెద్దపీట
కవాడిగూడ : క్రైస్తవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఈ మేరకు ఆదివారం భోలక్‌పూర్ డివిజన్ రంగానగర్లోని బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలను ఆయన పలువురు టీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేసి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తున్నదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తున్నారని తెలిపారు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి తదితర పథకాలను ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ పేదలకు భరోసా కల్పించారని అన్నారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను వైభవంగా జరుపుకోవాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ భోలక్‌పూర్ డివిజన్ అధ్యక్షుడు వై.శ్రీనివాస్‌రావు, పాస్టర్స్ ఎలియా, అనిల్ కుమార్, సునీల్, నాయకులు శంకర్‌గౌడ్, రహీం, మక్భూల్, రవీందర్, ఆరీఫుద్దీన్, కృష్ణ పాల్గొన్నారు.