MLA Mallareddy | మేడ్చల్ మల్కాజ్గిరి : మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి బంగారం లాంటి మనిషి.. ఆయన మల్లారెడ్డి కంటే మంచోడు అని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రశంసించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు.
ఈ నియోజకవర్గం పరిధిలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అందరూ మనోళ్లే. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల చైర్మన్లు కూడా మనోళ్లే. అలా పని చేసి.. అన్నింటినీ సాధించుకున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే కార్యకర్తలు ఉన్నారు. ఒక్క పిలుపునిస్తే వేల సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ భయపడేది లేదు. రాగిడి లక్ష్మారెడ్డి బంగారం.. మల్లారెడ్డి కంటే మంచోడు. నా కంటే ఎక్కువ సేవ చేసిండు. ఎంతో మంది పేదలను ఆదుకున్నాడు. ఆపరేషన్లు చేయించాడు. రాగిడి లాంటి నాయకుడు మనకు ఎక్కడా దొరకడు. మనకు ఇంత మంచి ఎంపీ అభ్యర్థి దొరకడం మనందరి అదృష్టం. మల్కాజ్గిరి ఎంపీ నియోజకవర్గంలో ఏడుగురు ఎమ్మెల్యేలు మన దగ్గర్నే ఉన్నారు. 200 మందికి పైగా కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్సే. ఇతర పార్టీలకు కేడర్ లేదు.. నాయకులు లేరు. పోలింగ్ బూత్‌ల్లో కూర్చొనేందుకు కూడా నాయకుల్లేరు. కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు అని మల్లారెడ్డి పేర్కొన్నారు.