ఎవరైనా కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవు : ఎమ్మెల్యే మైనంపల్లి
మల్కాజిగిరి, మార్చి 16: ప్రభుత్వ భూములను కాపాడుతామని, ఎవరైనా కబ్జాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హెచ్చ రించారు. బుధవారం మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నేరేడ్మెట్ డివిజన్, యాప్రాల్‌లోని నాగిరెడ్డి చెరువు ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు జరిగాయని, నాలాను కబ్జాచేసి నిర్మాణాలు చేపట్టడంతో వరదనీరు కాలనీల్లో ఇండ్లను ముంచెత్తాయని అన్నారు. గతంలో అధికారులు సర్వేచేసి నాలాపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని తేల్చారని..ఈ అక్రమ నిర్మాణాలను తొలగించామని అన్నారు. అయితే.. అక్రమ నిర్మాణాల కూల్చివేత లను మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రశ్నించడం సరికాద ని అన్నారు. అభివృద్ధి పనులు చేపడితే బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారని అన్నారు. నాగిరెడ్డి చెరువు నుంచి కాప్రా చెరువు వరకు రూ.41కోట్లతో బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టామ ని, ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లోని షిరిడీ నగర్, సిఫిల్కాలనీలు వరద ముంపు నకు గురికాకుండా రూ.19కోట్లతో బాక్స్ డ్రైన్ పనులు చేపట్టామని.. కొందరు పనులు అడ్డుకోవడంతో ఆ పనులు ఆగిపోయాయని అన్నారు. దీంతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని అన్నారు. ఆనంద్‌బాగ్ ఆర్‌యూబీలు, మౌలాలి కమాన్ సమస్యలను పరిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, మీనాఉపేందర్ రెడ్డి, శాంతిశ్రీనివాస్ రెడ్డి, రాజ్ జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్‌గౌడ్, అల్వాల్ మాజీ మున్సిపల్ చైర్మన్ జీవకన్, అనిల్‌కిశోర్, పరుశురాంరెడ్డి, జీఎన్వీ సతీశ్‌కు మార్, గుండా నిరంజన్, శ్రీనివాస్, రాముయాదవ్, సంతోశ్రాందాస్, ఎస్ఆర్ ప్రసాద్, మహాత్య వర్ధన్, గద్వాల జ్యోతి, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.