వెంగళరావునగర్, ఆగస్టు 28 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రొటోకాల్‌ను (Protocol) విస్మరిస్తుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్(MLA Maganti) విమర్శించారు. ప్రొటోకాల్‌కు తిలోదకాలు ఇవ్వడంపై అసెంబ్లీ స్పీకర్‌కు తాను ఫిర్యాదు చేశామని అన్నారు. బుధవారం శ్రీనగర్ కాలనీ డివిజన్ నవోదయ కాలనీలోని తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేస్తుందని ఆరోపించారు.
గతంలో తమ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులను పంపిణీ చేసేవారమని పేర్కొన్నారు. డివిజన్ వారీగా సభలు పెట్టి లబ్ధిదారులకు చెక్కులతో పాటు బహుమతులను తాను ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ చెక్కులను ఆయా తహసీల్దార్ కార్యాలయాల్లోనే ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించినట్లు అధికారులు అంటున్నారని తెలిపారు.
పేద ప్రజలు ప్రభుత్వ కార్యాయలయాల చుట్టూ తిరగాలంటే రవాణా ఖర్చులవుతాయన్నారు. ఖైరతాబాద్ మండల రెవెన్యూ కార్యాలయంలో షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి లబ్ధిదారుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు అధికారులు లంచాలు వసూలు చేస్తున్నట్లు ప్రజలు తన దృష్టికి తెచ్చారని..అవినీతికి తావులేకుండా గతంలోనే మాదిరిగానే ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.