కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 22 : కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్లోని గోపాల్‌నగర్ కాలనీ నుంచి ముళ్లకత్వ చెరువు వరకు ఏర్పాటు చేసే డ్రైనేజీ ఫైప్‌లైన్ పనులకు ఆటంకం కలిగిస్తున్నవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకో వాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram) అన్నారు. బుధవారం గోపాల్‌నగర్ కాలనీలో డ్రైనేజీ ఫైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్‌రావు, జలమండలి, జీహెచ్ఎంసీ, రెవెన్యూ విభాగాల అధికారులు పరిశీలించారు.
గోపాల్‌నగర్ కాలనీ రోడ్డు ప్రక్కన చేస్తున్న ఫైప్‌లైన్ పనులకు కొద్దిమంది ప్లాట్ యాజమానులు అభ్యంతరం చెప్పడం సరికాదన్నారు. గోపాల్‌నగర్ లేఅవుట్ ప్రకారం రోడ్డు ప్రక్కన స్థలం జలమండలికి సంబంధిం చిందని, జీహెచ్ఎంసీ మాస్టర్ ప్లాన్‌లో ఈ రోడ్డును 200 ఫీట్లుగా గుర్తించామన్నారు. ఈ రోడ్డులో డ్రైనేజీ ఫైప్‌లైన్ పనులు చేస్తే అడ్డుకునే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. పనులను ఆటంకం కలిగించిన వ్యక్తుల డాక్యుమెంట్లను పరిశీలించాలన్నారు.
కూకట్పల్లి, శేరిలింగంపల్లి మండలాల రెవెన్యూ అధికారులు డాక్యుమెంట్లను పరిశీలించాలని, తగిన విధంగా మార్కింగ్ చేసి, రిపోర్టును జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు అందజేయాలన్నారు. ఫైప్‌లైన్ పనులను ఆపిన వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. రానున్న వర్షాకాలంలోపు పనులను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.